అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ ఐసీడీఎస్ పరిధిలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు.. అంగన్వాడీ కేంద్రాలకు కుక్కర్ల పంపిణీ
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ఉరవకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఐదు మండలాల నుంచి ఎంపికైన 23 మంది అంగన్వాడీ ఆయాల్లో 19 మందికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం నియామక పత్రాలను అందజేశారు.
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అందజేసిన కుక్కర్లను కూడా మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, నూతనంగా నియమితులైన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన సేవలు అందించే బాధ్యతతో అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సాజిదా, ఉరవకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో డాక్టర్ బి.ఎన్. శ్రీదేవి, సూపర్వైజర్లు అరుణ, ధనశేఖర్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
