నరసింహుని సన్నిధిలో పయ్యావుల, కాల్వ

నరసింహుని సన్నిధిలో పయ్యావుల, కాల్వ

  • స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ , రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేగాటి నాగరాజు, జిల్లా దేవదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్, ఆలయ కార్యనిర్వాహణాధికారి సాకే రమేష్ బాబు, అర్చకులు ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి పయ్యావుల కేశవ్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కేశవ్ కు, కాల్వ శ్రీనివాసుల పేరిట దేవాలయ ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. కేశవ్ కు, కాల్వ శ్రీనివాసులకు సన్మానించి తీర్థ ప్రసాదాలను, అందజేశారు. అనంతరం స్వామివారి పల్లకి సేవలో మంత్రి కేశవ్ పాల్గొన్నారు. ఆశేష జన
సందోహం మధ్య మడుగు తేరు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీవో శ్రీనివాస్ తహసీల్దార్ భోగన్న గౌడ్, ఇన్స్పెక్టర్లు హోన్నూర్ స్వామి, రాణి, ఆర్ఐ రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు బొల్లినేని పద్మాక్షి, దెబ్బర మాధవి, బోయ రాములమ్మ, కురుబ ఇంద్రమ్మ, బోయ ఎర్రమ్మ, చావలిబాయి, మీనుగ రామకృష్ణ, ధనుంజయ ఆచారి, చంద్రమౌళి స్వామి, మంగళ చిన్న నారాయణ, ఉరవకొండ మార్కెట్ యాడ్ చైర్మన్ విజయభాస్కర్, ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ తిమ్మప్ప, మాజీ సర్పంచులు మోపిడి గోవిందు, ఇంద్రావతి వెంకటేశులు, టిడిపి నాయకులు ఇంద్రావతి సుధాకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.