ఏటూరు గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం..
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఏటూరు గ్రామానికి చెందిన సాధనపల్లి రూప నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై టెంకాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎండీ అప్సర్ పాషా కూడా పాల్గొని గృహప్రవేశాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాడి రాంబాబు మాట్లాడుతూ,మంత్రి సీతక్క ఆదేశాలు,డీసీసీ అధ్యక్షుడు పైడకుల అశోక్ సూచనల మేరకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు సాధనపల్లి రూప మాట్లాడుతూ, తమలాంటి పేద కుటుంబాలకు రూ.5 లక్షలతో సొంతింటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి సీతక్క,ప్రజా ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు డేగల బాణయ్య, కాంగ్రెస్ నాయకులు గాయం రాజబాబు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ జిల్లా కమిటీ సభ్యుడు సునార్కని రాంబాబు,మండల కోఆర్డినేటర్ దుర్గం ప్రభాకర్, చిట్యాల అరుణ్ కుమార్, జాడి వెంకట్, సిద్దబోయిన సాగర్, సుధాకర్,బుట్టాయిగూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడు సునార్కని శ్రీరాములు, యువ నాయకుడు తోట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
