అస్తవ్యస్తంగా ప్రధాన రహదారి

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రెవుల గ్రామ ప్రధాన రహదారి వర్షాల కారణంగా పూర్తిగా బురదమయంగా మారింది. రోడ్డంతా బురద, నీటి గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర పనుల కోసం ప్రయాణించే గ్రామస్థులు ప్రతిరోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.