సమయపాలన పాటించని EGS సిబ్బంది,అధికారులు..

సమయపాలన పాటించని EGS సిబ్బంది,అధికారులు..

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : కన్నాయిగూడెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో EGS సిబ్బంది,అధికారులు నిర్ణీత సమయానికి విధులకు హాజరు కావడం లేదని పలువురు ప్రజలు ఆరోపించారు. దీంతో పనుల నిమిత్తం వచ్చిన రైతులు, కూలీలు గంటల తరబడి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.EGS పనులు, బిల్లులు, హాజరు రిజిస్టర్లకు సంబంధించిన పనుల్లో జాప్యం జరుగుతోందని వారు తెలిపారు. అధికారులు విధి సమయాలను తప్పనిసరిగా పాటించి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. సమయపాలన పాటించని సిబ్బందిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.