ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ..
39 గ్రాముల బంగారం అపహరణ
గురజాడ గ్రామంలో ఘటన..
క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించిన పోలీసులు
పమిడిముక్కల, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని గురజాడ గ్రామంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. ఇంటి యజమాని కుటుంబ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి సుమారు 39 గ్రాముల బంగారు నగలను అపహరించారు.
బాధితుడు తాతా సుబ్బారావు కాజలో జరిగిన కుటుంబ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగిన విషయం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పమిడిముక్కల ఎస్ఐ బి. శ్రీను ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలను సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
