31 people | మాజీ డీజీపీలకు ఎస్కార్ట్ రద్దు
31 people |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణలో పలువురు రాజకీయ నాయకులు, ప్రస్తుత, మాజీ పోలీసు ఉన్నతాధికారులు, విశ్రాంత అధికారులకు కల్పిస్తున్న భద్రతను రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించింది. మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గి రాష్ట్రం మావోయిస్టు రహిత తెలంగాణగా మారిన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో మార్పులు చేపట్టినట్లు సమాచారం.
ఈ నిర్ణయంలో భాగంగా మాజీ డీజీపీలతో పాటు పలువురు ప్రస్తుత పోలీసు ఉన్నతాధికారులకు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను ఉపసంహరించినట్లు తెలుస్తోంది. అలాగే మొత్తం 31 మంది ప్రస్తుత, మాజీ పోలీసు ఉన్నతాధికారుల భద్రతను తగ్గించినట్లు సమాచారం.
డీజీపీ సి.వి. ఆనంద్ ఆధ్వర్యంలో ఎస్కార్ట్ వాహనాలను ప్రభుత్వానికి సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ డీజీపీలకు కేటాయించిన ఎస్కార్ట్ వాహనాలను కూడా ఉపసంహరించినట్లు సమాచారం.
అదే విధంగా పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు కేటాయించిన గన్‌మెన్ల సంఖ్యను కూడా తగ్గించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తాజా భద్రతా మదింపు నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
