మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పనులలో విజయం. తీర్థయాత్రలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృషభం: ఇంటాబయటా అనుకూలత. కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయా లు పెరుగుతాయి. సంఘంలో మరింత గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మిథునం: కొన్ని పనులలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొం టారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం: వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. విందువినోదాలు.
కన్య: దూరపు బంధువుల కలయిక. పనులు సజావుగా సాగుతాయి. వాహనయోగం.ప్రముఖులతో చర్చలు సఫలం. వ్యాపారాలలో పెట్టుబడులందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.
తుల: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు ఎదురుకావచ్చు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజకనంగా ఉంటాయి. కళాకారులకు ఒత్తిడులు.
వృశ్చికం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు కలసిరావు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
ధనుస్సు: కార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు. కళాకారులకు సత్కారాలు.
మకరం: పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబ సభ్యులతో తగాదాలు. వ్యాపారాలు చికాకు పరుస్తాయి.
కుంభం: పలుకుబడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ఆదరణ. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. ఉద్యోగాలలో పురోగతి.
మీనం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. కళాకారులకు శ్రమాధిక్యం.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
