TG | 14న మద్యం షాపులు బంద్ !

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14న మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 14వ తేదీ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయ‌నున్నారు.

మద్యం సేవించిన బహిరంగ ప్రదేశాల్లో గొడవకు సృష్టిస్తే.. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

హోలీ సందర్భంగా పోలీసుల ఆంక్షలు..

రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. రోడ్లపై గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని… ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు. 14న ఉదయం 6 నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమ‌ల్లో ఉంటాయ‌ని పేర్కొన్నారు.

Leave a Reply