సహకార సంఘం చైర్మన్‌గా రాంరెడ్డి బాధ్యతల స్వీకరణ

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ: నేరేడుచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా కొప్పుల రాంరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో చైర్మన్‌గా ఉన్న దొండపాటి అప్పిరెడ్డి నేరేడుచర్ల మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నిక కావడంతో ఆయన రాజీనామా చేయగా, వైస్ చైర్మన్‌గా ఉన్న కొప్పుల రాంరెడ్డి చైర్మన్ పదవిని చేపట్టారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం డైరెక్టర్లు, రైతులు, ప్రజాప్రతినిధులు రాంరెడ్డిని ఘనంగా సన్మానించి అభినందించారు. రైతుల అభ్యున్నతికి, సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి, పత్తేపురం సర్పంచ్ కోనుగంటి సూజాత సోమిరెడ్డి, సంఘ డైరెక్టర్లు దేవులపల్లి శంకరాచారి, వేముల జయమ్మ, నూకల వెంకట్ రెడ్డి, సఫావత్ భీక్యా, కుసుమ శేఖర్ రెడ్డి, నాయకులు సంకలమద్ది లీలా మాన్షు రెడ్డి, కోణతం వెంకట్ రెడ్డి, నూకల రాంరెడ్డి, ఎం. వెంకట్ రెడ్డి, ఎన్. మురళీధర్ రెడ్డి, ఏ. సైదిరెడ్డి, ఎం. గోపాల్, ఎన్. మధుకర్ రెడ్డి, కె. మల్లారెడ్డి, ఎం. సుందర్ రెడ్డి, పి. వెంకటయ్య, సీహెచ్. వెంకట్ రెడ్డి, ఎన్. వెంకట్ రెడ్డి, కె. అచ్చిరెడ్డి, ఎం. మహేష్ తదితరులు పాల్గొన్నారు.