ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు విశేష స్పందన
భవానిపురం, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో నిరంతరం ప్రజా దర్బార్ లను నిర్వహిస్తున్నారు.ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి మంగళవారం భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. పశ్చిమ ప్రజలు తమ వినతులను రేషన్ కార్డులు,పింఛన్లు, తాగునీరు, ఇళ్ల స్థలాలు,వైద్య సహాయం వంటి తదితర సమస్యలపై దరఖాస్తు రూపంలో అందజేశారు.
సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు, పెద్ద సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజన చౌదరి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కూటమి నేతలు తెలిపారు.మైనారిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ , కామ దేవరాజ్,బీజేపీ నేత పోలవరపు దుర్గారావు , రౌతు రమ్యప్రియ పాల్గొన్నారు.
