ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంలో విద్యుత్ చౌర్యం
కాంట్రాక్టర్‌కు రూ.75 వేల జరిమానా
అశ్వారావుపేట, ఆంధ్రప్రభ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన కాంట్రాక్టర్‌కు విద్యుత్ శాఖ అధికారులు రూ.75,218 అపరాధ రుసుము విధించారు.ఈ అంశంపై మంగళవారం ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనానికి స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యుత్ చౌర్యం జరిగిన తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏడీఈ వెంకటరత్నం మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల కోసం సెరికల్చర్ మీటర్‌ను వినియోగించడం విద్యుత్ చట్టం ప్రకారం నేరమని తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత గుత్తేదారునికి రూ.75,218 జరిమానా విధించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
