ఎస్ఐఆర్ సర్వేకు గ్రామస్తులు అందరు సహకరించాలి..
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : ఎస్ఐఆర్ (స్పెషల్ ఎంటెన్సివ్ రివిజన్) సర్వేకు గ్రామస్తులందరూ తమ వంతు సహకారం అందించాలని కంఠలి గ్రామసర్పంచ్ మేత్రి నాగనాథ్ అన్నారు మంగళవారం నాడు స్థానిక బిఎల్ఓలు ప్రదీప్,గంగాధర్,దినేష్ మరియు రేషన్ డీలర్ అరుణ్ పాటిల్ తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల సర్వే ప్రాముఖ్యతను వివరించారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలు సక్రమంగా నమోదు చేసుకుని అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఎస్ఐఆర్ కొనసాగుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి ప్రాముఖ్యత ఇస్తూ తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు.ఈ సందర్భంగా బిఎల్ఓలు ఫారాలు నింపేవిధానం, తదితరఅంశాలపై ఓటర్లకు అవగాహన కల్పించారు.
