నూతన ఎస్సై కొమురయ్య కు ఘన సన్మానం..

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కొమురయ్యను జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంతరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై కొమురయ్య మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంతరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు, మాజీ సర్పంచ్ ఆర్క నాగోరావు, సర్పంచ్ భూపతి, బీఆర్ఎస్ నాయకులు మాడవి బొజ్జిరావు, గేడం యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.