వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
గన్నవరం, ఆంధ్రప్రభ: గన్నవరం మండల పరిధిలోని బి. బిగూడెం గ్రామ సమీపంలోని వెస్ట్ బైపాస్‌పై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న లారీ, స్కూటీ, కారు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు, మృతుల వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
