సీజ్ చేసిన 227.18 కేజీల గంజాయి నిర్విర్యం
- జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో ప్రభుత్వం, కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్వీర్యం
- పర్యావరణ రక్షణ, ప్రజా ఆరోగ్యానికి హని కలగకుండా జాగ్రత్తలు
- యాదాద్రి జిల్లా తుక్కాపుర్ గ్రామంలో గల రోమా ఇండస్ట్రీస్ లో అత్యాధునిక సాధనంతో బూడిద చేశాం
- జిల్లా ఎస్పి కె.నరసింహ
సూర్యాపేట, ఆంధ్రప్రభ : 29 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 227.18 కేజీ గంజాయినీ ప్రభుత్వ, కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో మంగళవారం యాదాద్రి జిల్లా తుక్కాపుర్ గ్రామం లోగల రోమా ఇండస్ట్రీస్ యాజమాన్యం, సిబ్బంది సహాయంతో ప్రభుత్వ సాక్షుల సమక్షంలో గంజాయిని నిర్వీర్యం చేసి బూడిద చేయడం జరిగిందని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఎస్పి నరసింహ తెలిపారు. పర్యావరణానికి, ప్రజా జీవనానికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకుని నిర్విర్యం చేయడం జరిగిందన్నారు. దీని విలువ 1 కోటి పైనే ఉంటుందని వెల్లడించారు. డ్రగ్స్ నివారణ అందరి సామాజిక బాధ్యత. డ్రగ్స్, గంజాయి వినియోగించడం వల్ల యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

డ్రగ్స్ రవాణా, వినియోగం నేరమన్నారు. గంజాయి నివారణ లో జిల్లా పోలీసు కృషి చేస్తుంది అన్నారు. డ్రగ్స్ అమ్మకం, రవాణా, వినియోగం కు సంభందించి పోలీసులకు, డయల్ 100, 112, 1908 కు సమాచారం ఇవ్వాలన్నారు. డగ్స్, గంజాయి వియోగించే వారిని, వ్యాపారం చేసే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల అలవాట్లను గమనిస్తూ చెడు వ్యసనాలకు లోనవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు డిఎస్పిలు ప్రసన్న కుమార్, శ్రీనివాస్ రెడ్డి, రవి, నరసింహ, ఎస్ఐ లు యాకూబ్, జాన్సీరాణి, సిబ్బంది ఉన్నారు.
