108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, శిశువు క్షేమం
జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని చింతకర్ర గ్రామానికి చెందిన గర్భిణి పూర్కా అనసూయకు మంగళవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న 108 ఈఎంటి సీహెచ్ రవి, పైలెట్‌తో కలిసి ఆమెను కేరమెరి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే పురిటి నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
అనంతరం తల్లి, శిశువును ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఈఎంటి సీహెచ్ రవి తెలిపారు. అత్యవసర పరిస్థితిలో సమయస్ఫూర్తితో సురక్షిత ప్రసవం నిర్వహించిన 108 ఈఎంటి, పైలెట్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
