Stock Market Crash | మార్కెట్లపై గ్లోబల్, వాతావరణ ప్రభావం

Stock Market Crash | మార్కెట్లపై గ్లోబల్, వాతావరణ ప్రభావం

Stock Market Crash | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇవాళ ప్రారంభంలో లాభాల్లో కనిపించినప్పటికీ, వెంటనే అమ్మకాల ఒత్తిడికి లోనై నష్టాల్లోకి జారుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 94.61 వద్ద బలహీనపడటం, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం లోటు ఉండొచ్చనే అంచనాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

గత ట్రేడింగ్ సెషన్‌లో 76,728 వద్ద ముగిసిన సెన్సెక్స్, మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనా ఒక దశలో దాదాపు 600 పాయింట్లు కోల్పోయింది. అనంతరం కొంత కోలుకుని ఉదయం 10 గంటల సమయానికి 170 పాయింట్ల నష్టంతో 76,558 వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ కూడా అదే ధోరణిలో కొనసాగుతూ 60 పాయింట్లు క్షీణించి 23,885 వద్ద ట్రేడవుతోంది. అయితే బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లతో బ్యాంక్ నిఫ్టీ 61 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 21 పాయింట్ల నష్టంలో ట్రేడవుతోంది.

ఈరోజు ట్రేడింగ్‌లో భారత్ డైనమిక్స్, సమ్మన్ క్యాపిటల్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, ఏబీ క్యాపిటల్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ఉండగా, ఎయిచర్ మోటార్స్, కేపీఐటీ టెక్నాలజీస్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, భారత్ ఫోర్జ్, నాల్కో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.