హెలిపాడ్ ను పరిశీలిస్తున్న సిఐ దయాకర్..

తాడ్వాయి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తాడ్వాయి మండలం మేడారంలోని హెలిపాడ్‌ను పస్రా సీఐ దయాకర్, తహసీల్దార్ సురేష్‌బాబు శనివారం పరిశీలించారు. హెలికాప్టర్‌ దిగే సమయంలో దుమ్ము, ధూళి లేవకుండా హెలిపాడ్‌ వద్ద సిమెంట్‌ ఫ్లోరింగ్‌ పనులు చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా హెలిపాడ్‌ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకయ్య, ఎస్‌ఐ కమలాకర్, తాడ్వాయి మండల మాజీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్, మాజీ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్ అరేం లచ్చు పటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ప సునీల్ దొర, పాక సాంబయ్య, పాక రాజేందర్, చందులాల్ తదితరులు పాల్గొన్నారు.