Central Tribal University | విశాఖలో నేడు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం..

Central Tribal University | విశాఖలో నేడు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం..

హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Central Tribal University | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలో నేడు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంగా మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనుండగా, వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేయనున్నారు.

స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్య, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విశ్వవిద్యాలయం పరిసరాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.