ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభం..
- 10వ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
- జులై 28 వరకు అపరాధ రుసుము లేకుండా అడ్మిషన్లు
మరిపెడ, ఆంధ్రప్రభ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ కోఆర్డినేటర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంతరావు, అసిస్టెంట్ కోఆర్డినేటర్ జనార్ధన్ చారి తెలిపారు.
మధ్యలో చదువు మానివేసిన విద్యార్థులు, వివిధ కారణాల వల్ల విద్యను కొనసాగించలేకపోయిన వారు తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా తిరిగి చదువును ప్రారంభించి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం (పుట్టిన తేదీ ధ్రువపత్రం)తో పాఠశాల కార్యాలయంలో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జులై 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 77299 67711 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.
