మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సేవలు మరువలేనివి..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్ దివంగత రాథోడ్ రమేష్ చేసిన సేవలు మరువలేనివని ఆదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ అన్నారు.

సోమవారం ఉట్నూర్ మండలంలోని నాగాపూర్ సమీపంలో ఉన్న రాథోడ్ రమేష్ స్మృతివనంలో ఆయన రెండో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు రాథోడ్ రమేష్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాథోడ్ రమేష్ ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్‌గా, ఎంపీగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ భీమ్రావు, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, బీజేపీ జాతీయ నాయకుడు శ్రీరామ్ నాయక్, ఇంద్రవెల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్ నాయక్, నిర్మల్ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, ఆసిఫాబాద్ డీసీసీ కార్యవర్గ సభ్యుడు పేందూర్ ప్రకాశ్, ఆంద్ సమాజ్ నాయకుడు దుక్రీ సుభాష్, వివిధ పార్టీల నాయకులు, బంజారా సంఘాల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.