Urea | ఎరువులపై ఆందోళన వద్దు..
Urea | ఎరువులపై ఆందోళన వద్దు..
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
యాప్ ద్వారానే బుకింగ్ చేసుకోండి
ఇంటి నుంచే పారదర్శకంగా ఎరువుల బుకింగ్‌కు అవకాశం
పశ్చిమాసియా సంక్షోభం మధ్య కూడా సకాలంలో ఎరువులు అందించామని వెల్లడి
Urea | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఎరువుల లభ్యతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. సాంకేతికతను వినియోగిస్తూ రైతులు ఇంటి నుంచే యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువులు బుక్ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు.
రాష్ట్రంలోని రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎరువుల కోసం రైతులు క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదని, ఇంటి నుంచే మొబైల్ యాప్ ద్వారా పారదర్శకంగా బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు.
ఎరువుల సరఫరాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసిన మంత్రి, రైతుల అవసరాలకు అనుగుణంగా సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎరువుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు డిజిటల్ విధానాలను అమలు చేస్తున్నామని వివరించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో ఎదురైన సవాళ్లు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుని రాష్ట్రానికి అవసరమైన ఎరువులను సకాలంలో అందించగలిగామని మంత్రి తెలిపారు.
రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయానికి అవసరమైన అన్ని ఇన్పుట్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, అందుబాటును మరింత మెరుగుపరుస్తూ రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
