పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి..
తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు పట్టణంలోని హరిపిరాల రోడ్డు కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న ఎంపీపీఎస్ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. శారదాదేవి కోరారు.పాఠశాలలో ఉన్న సమస్యలపై సోమవారం తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల లోపల బయట ఆవరణలో చెత్తను తొలగించి చెత్త కుండిని ఏర్పాటు చేయాలని,వర్షానికి కూలిపోయిన ప్రహరీ గోడ నిర్మించాలని,వంట గదికి మరమ్మత్తు పనులు చేయించాలని, మిషన్ భగీరథ నల్ల ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలకు రంగులు వేయించి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రమాదేవి, ఉపాధ్యాయులు విమలాదేవి, దర్గా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
