పల్స్ పోలియో చుక్కలతో చిన్నారుల బంగారు భవిష్యత్తు

  • వైస్ చైర్‌పర్సన్ అల్లం రమా నాగేశ్వర్ రావు

కేసముద్రం, ఆంధ్రప్రభ : చిన్నారుల నిండైన జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు అత్యంత అవసరమని కేసముద్రం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ అల్లం రమా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.

ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ ఆగే రాము, పిహెచ్సి డాక్టర్ నంబికిషోర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.