పిల్లల భవిష్యత్తుకు రెండు పోలియో చుక్కలు..

  • శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి…
  • మొయినాబాద్ లో పోలియో చుక్కల పంపిణీ…

ఉమ్మడిరంగారెడ్డి, ఆంధ్రప్రభ బ్యూరో : పిల్లాల భవిషత్తు కోసం విధిగా పోలియో చుక్కలు వేయించాలని శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో తిరిగి పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు.

పోలియో రహిత సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత అని ఈ మహత్తర లక్ష్యం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గ ఇంఛార్జి భీం భరత్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారీ, మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ జకీర్, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ , మండల పార్టీ అధ్యక్షుడు మానయ్య , వైస్ ప్రెసిడెంట్ మర్రి రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ షాబాద్ సోనియా దర్శన్, పార్టీ నేతలు మహేందర్ రెడ్డి , సంజీవ రెడ్డి, కంజర్ల భాస్కర్, బద్రప్ప, జయ రామ్ రెడ్డి, అనంత రెడ్డి , గణేష్ గౌడ్ , బాల కృష్ణా రెడ్డి, కేబుల్ రాజు , చిలుకూరు రాజు , విఠల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.