చికిత్స పొందుతూ కన్నుమూసిన వాలీబాల్ క్రీడాకారుడు

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని చింతగూడెం సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సర్వాయి గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు నల్లబోయిన రాజ్‌కుమార్ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో సింగారం గ్రామానికి చెందిన మట్టి మహేష్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

పలు వాలీబాల్ టోర్నమెంట్లలో తన జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రాజ్‌కుమార్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, క్రీడాభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పలువురు క్రీడాకారులు, స్థానికులు సంతాపం తెలిపారు.