విశేష అలంకరణలో ఆలేరు కనకదుర్గమ్మ

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో 11వ వార్షికోత్సవం, దుర్గమ్మ పండుగ సందర్భంగా ఆదివారం అమ్మవారికి విశేష అలంకరణ నిర్వహించారు. ప్రముఖ అర్చకులు ఆలేరు రంగన్న పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పండుగ వేడుకలతో ఆలయం భక్తజన సందోహంతో కళకళలాడింది.