కాంగ్రెస్ పార్టీతో సొంత ఇంటి కల సాకారం..

  • కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి

మరిపెడ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ తోనే సొంత ఇంటి కల సహకారం అయిందని కాంగ్రెస్ పార్టీ మరిపెడ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి అన్నారు. మరిపెడ మండలం గుండెపూడి గ్రామానికి చెందిన బింగి నీరజ ఉప్పలయ్య కు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిలో శనివారం గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సూరబోయిన ఉప్పలయ్య, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గడ్డం వెంకట్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులుసు మల్లేష్, ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు రేఖ శ్రీను, పెద్దబోయిన శ్రీను, వడ్లకొండ సుజాత, బాలు ,వార్డు సభ్యులు బోడపట్ల యాకన్న, నవీన్, నాయకులు ఓర ఉప్పలయ్య, అజ్మీర రమేష్, బాబు, ఇమ్మానుయేల్, రేఖ ఉప్పలయ్య, బర్మావత్ సోమన్న, రేఖ నరేష్, సాగాల యాకేష్, బాదావత్ నాగరాజు, పులుసు మహేష్ తదితరులు పాల్గొని బింగి నీరజ ఉప్పలయ్య కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.