వలిగొండలో ఎమ్మెల్యే కుంభం సుడిగాలి పర్యటన
- సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చూపుతున్న ఎమ్మెల్యే
- చిన్ననాటి స్నేహితుని కుటుంబానికి ఒక లక్ష ఆర్థిక సాయం అందజేత
- సుంకిశాలలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు రాములును పరామర్శ
- మొహరం సంబరాలలో ఎమ్మెల్యే
- సొంత ఊరు ప్రజలంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం
- భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
వలిగొండ, ఆంధ్రప్రభ : నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకో వడం అవసరమైన సమయంలో వారికి చేయూత అందించడం ప్రజాసేవ పట్ల భువనగిరి ఎమ్మెల్యే కుంభంకు ఉన్న నిబద్ధతకు నిలువుటద్దమని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఎమ్మెల్యే ను అభినందిస్తున్నారు.భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం రాత్రి వలిగొండమండల కేంద్రంలో మొహరం పండుగ ఉత్సవాల్లో పాల్గొని రాత్రి ఇక్కడ నే బస చేసి శనివారం ఉదయం పట్టణం లోని సేతారామచంద్ర స్వామి దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం వలిగొండ పట్టణంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు.
పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా పలువురి కుటుంబాలను పరామర్శించి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వారికి భరోసా ధైర్యం కల్పించారు. వలిగొండలో తన చిన్ననాటి ప్రాణమిత్రుడు అయిన రామచంద్రు ముదిరాజ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులనుఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా స్థానికంగా రోడ్డుపై కార్యకర్తలతో కలిసి టిఫిన్ చేయడం జరిగింది. అనంతరం మండలంలోని సుంకిశాల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈతాప రాములు కు ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ వచ్చి తగ్గడంతో ఆయనను పరామర్శించి రాములు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని ఎమ్మెల్యే కుంభం భరోసా కల్పించారు. గ్రామంలో పర్యటించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత ఊరి ప్రజలంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం అన్నారు .ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యేగా నా బాధ్యత అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి నా వంతు సహాయం అందిస్తూనే ఉంటానన్నారు.
ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సాయానికి రామచంద్రు ముదిరాజ్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక. కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట వలిగొండ సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని సహదేవ్, పట్టణ అధ్యక్షులు జానకి రాములు ఉపసర్పంచ్ మాల్గా మాధవి, కాంగ్రెస్ నాయకులు బత్తిని లింగయ్య, గంగాధరి రాములు వాకిటి అనంతరెడ్డి చెరుకు శివయ్య గౌడ్ ఐటి పాముల రవీందర్, కొండూరు సాయి కాసుల వెంకన్న వార్డ్ మెంబర్ ఎల్లంకి నాగరాజు, జక్క జంగారెడ్డి, చిలుకూరి సత్తిరెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
