వరుణుడి కరుణ కోసం…

చిట్యాల, ఆంధ్రప్రభ : వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం ఉపాధి హామీ పథకం మహిళా కూలీలు బతుకమ్మ ఆడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో పాటు వరి, మిరప, మొక్కజొన్న తదితర పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాల రైతులు, మహిళలు వరుణదేవుడు కరుణించి మంచి వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. త్వరలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.