Incident | రూ.25వేలు లంచం తీíకుంటూ…
Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ అవినీతి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో శనివారం గ్రామపంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన కలకలం రేపింది.
ఏసీబీ వివరాల ప్రకారం.. ముదిగొండ మండలంలోని బాణాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్, ఓ వ్యక్తి ఇంటి నిర్మాణ అనుమతికి సంబంధించి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడు కోరిన మేరకు తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ, పూర్తి మొత్తాన్ని చెల్లిస్తేనే పని చేస్తానంటూ రెండు మూడు నెలలుగా తిప్పినట్లు సమాచారం.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శనివారం రూ.25 వేల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి సురేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని, లేదా 9440446106 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారులు ప్రజలను కోరారు.
