వైభవంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహోత్సవం.

నర్సాపురం, ఆంధ్రప్రభ : నర్సాపురం మండలం ఎర్రంశెట్టి వారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామి వారి మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రం శెట్టి బాబులు దంపతులు స్వామి వారికి అభిషేకము, శాంతి హోమం తదితర పూజా కార్యక్రమాలతో కల్యాణోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అఖండ అన్న సమారాధనలో కూడా గ్రామస్థులు, భక్తులు పాల్గొనడం తో గ్రామం లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకొంది.

ఈ పూజా కార్యక్రమాలను వేదపండితులు పెద్దింటి అనిల్ కుమార్ శాస్త్రోత్త పరంగా జరిపారు. గ్రామస్తులు ఎర్రం శెట్టి పాండురంగ , కునపు రెడ్డి చంటి , ఎర్రం శెట్టి నరసింహారావు ,బాబ్జి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని కళ్యాణ మహోత్సవం ను పర్యవేక్షించారు.