ఎస్‌ఐఆర్ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

  • బీఎల్‌వో రత్నాల గంగవ్వ

కడెం, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) సర్వే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మాసాయిపేట్ గ్రామ బీఎల్‌వో రత్నాల గంగవ్వ కోరారు.

శనివారం మాసాయిపేట్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ సర్వే కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలకు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం కోసమే ఈ ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు.

అనంతరం ఓటర్లకు ఎస్‌ఐఆర్ దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరవింద్, రేషన్‌షాప్ డీలర్ షేక్ అజీజ్, స్థానిక నాయకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.