హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోండి
కమ్మర్‌పల్లి ఆంధ్రప్రభ: వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కమ్మర్‌పల్లి ఏఎస్ఐ వెంకట్‌కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ వెంకట్‌కుమార్ మాట్లాడుతూ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు కమ్మర్‌పల్లి ఎస్ఐ సీహెచ్. సతీష్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ వాడకం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. అలాగే అతివేగంగా వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు వివరించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది బావల లింబాద్రి, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.
