కూటమి ప్రభుత్వంలో పేదల వైద్యానికి తొలి ప్రాధాన్యత
- అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
- 85మందికి రూ.64,75,833ల సీఎంఆర్ఎఫ్ సహాయం
- నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,549 మందికి రూ.12.81కోట్ల సహాయం
అవనిగడ్డ, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా పేదల వైద్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 85మందికి రూ.64,75,833లు ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 1,549 మందికి రూ.12.81 కోట్లు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. పేదలు తమ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం కోరుతూ సమర్పించే దరఖాస్తులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తూ పేదలకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. లబ్ధిదారుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.
