నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 11వ తరగతి కామర్స్ గ్రూపులో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే ఈ ప్రవేశాలకు అర్హులని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.06.2009 నుండి 31.07.2011 మధ్య జన్మించి ఉండాలని స్పష్టం చేశారు.
అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 25వ తేదీ (25-06-2026) లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నవోదయ సమితి నియమావళి ప్రకారం విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తు ఫారం, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.navodaya.gov.in ను లేదా నేరుగా https://tinyurl.com/class-xi-application లింక్‌ను సందర్శించి అప్లికేషన్ పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను jnvpalnaduadmissions@gmail.com కు ఈమెయిల్ ద్వారా గానీ, లేదా నేరుగా విద్యాలయానికి వచ్చి గానీ సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు 7893051004 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
