Breaking | ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ వాయిదా..

  • వచ్చే నెల 22కు విచారణ వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
  • దానం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
  • స్పీకర్ తీర్పు కాపీలను కోర్టు ముందు ఉంచాలని సూచన

Breaking | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించిన విచారణను తెలంగాణ హైకోర్టు వచ్చే నెల 22కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అదేవిధంగా, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుల కాపీలను కోర్టు ముందు సమర్పించాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే నెల 22న జరగనుంది.