మత్తు పదార్థాలను వదలాలని భారీ ర్యాలీ..

జన్నారం, ఆంధ్రప్రభ : మత్తు పదార్థాలను అందరూ వదలాలని స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ తీసి, మానవహారం నిర్వహించారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు జన్నారం మండల కేంద్రంలో గురువారం విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు.మండల కేంద్రంలో విద్యార్థులచే స్థానిక రామాలయం నుంచి ప్రధాన రహదారి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు మత్తు పదార్థాలు వదలాలని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం చేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి జక్కు సుష్మా- భూమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీర్ నందునాయక్, తదితరులు పాల్గొన్నారు.