బాధితుడికి ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే వేముల..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన బనావత్ పత్తి అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వైద్య ఖర్చుల కోసం రూ.1,50,000 లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసి) మంజూరు చేయించారు.

ఈ మేరకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎల్ఓసి కాపీని రోగి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, చికిత్స కోసం ఎల్ఓసి మంజూరు చేయించి సహాయం చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.