rainy | ఈ వానాకాలంలో ఏదైనా వేడివేడిగా

rainy | మీ ఇమ్యూనిటీని కాపాడే సూపర్ ఫుడ్స్

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: వర్షాకాలం ప్రారంభమైంది. ఈ వానాకాలంలో చల్లని వాతావరణంలో ఏదైనా వేడివేడిగా తినాలని ఎవరికి ఉండదు చెప్పండి! ఎక్కడికైనా వెళ్లి వేడివేడిగా పునుగులు, మిర్చి బజ్జీలు తింటే ఆ ఆనందమే వేరు. ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా! అయితే, ఈ సీజన్‌లో బయట ఆహారం తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా తక్కువేమీ కావు. అప్పుడప్పుడూ ఒక్కసారి తింటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ వానాకాలంలో మనం తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదే కాలంలో జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు, జీర్ణకోశ సంబంధిత సమస్యలు వంటి అనారోగ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో సరైన పోషకాహారం తీసుకోవడం అత్యంత అవసరం. బయటి ఆహారాన్ని మితం చేసి.. ఇంట్లోనే మన శరీరానకి శక్తినిచ్చే ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి ఇచ్చే ఆహారం తీసుకోవడం వలన ఈ సీజన్‌ అనారోగ్యాల బారిన పడకుండా ఉండొచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలు..

వర్షాకాలంలో శరీర రోగనిరోధక శక్తి బలంగా ఉండటం చాలా అవసరం. అందుకోసం పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి సహజ ఔషధ గుణాలు కలిగిన పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చాలి.
పసుపు (హల్దీ): యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటుంది.
అల్లం: జలుబు, దగ్గు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి: శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
మసాలా దినుసులు: మిరియాలు, దాల్చినచెక్క వంటి పదార్థాలు శరీరానికి వేడి అందించి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని పెంచుతాయి.

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం ఎందుకు అవసరం?

వర్షాకాలంలో దాహం తక్కువగా అనిపించినా శరీరానికి తగినంత ద్రవాలు అవసరం. ఇందుకోసం

  • గోరువెచ్చని నీటిని తరచూ తాగాలి.
  • హెర్బల్ టీలు, గ్రీన్ టీలు తీసుకోవచ్చు.
  • వేడి వేడి సూప్‌లు శరీరానికి శక్తిని అందిస్తాయి.
  • తగినంత నీరు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • సీజనల్ పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం

ఈ పండ్లు, కూరగాయలతో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు..

-జామ, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
-ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయలు పోషకాలతో నిండి ఉంటాయి.

  • సంపూర్ణ ధాన్యాలుతీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

తేలికపాటి ఆహారం తీసుకోండి..

వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ కొంత మందగిస్తుంది. అందువల్ల అధిక నూనె, మసాలా పదార్థాలు కలిగిన ఆహారాన్ని తగ్గించడం మంచిది.

-వేయించిన పదార్థాలను పరిమితంగా తీసుకోవాలి.
-అధిక కొవ్వు ఉన్న ఆహారాలను తగ్గించాలి.
-సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోవాలి.
-ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

  • వేడి సూప్‌ల ప్రాధాన్యం
    వర్షాకాలంలో వేడి వేడి సూప్‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కూరగాయల సూప్, అల్లం సూప్, మిరియాల రసం వంటి ఆహారాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వర్షాకాలంలో ఈ సూచనలు తప్పక పాటించండి..

-బయట ఆహారం తినడాన్ని తగ్గించండి.
-తాగునీటిని శుభ్రంగా ఉంచండి.
-తాజా ఆహారం మాత్రమే తీసుకోండి.
-పండ్లు, కూరగాయలను బాగా కడిగి ఉపయోగించండి.
-రోజూ తగినంత నిద్ర, వ్యాయామం చేయండి.