సంస్థాగత బలోపేతానికి మరో ముందడుగు..
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నూతన జిల్లా కార్యాలయంలో గురువారం వాస్తు పూజ, కళ్యాణం, హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పోతుగంటి, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు, జిల్లా కార్యదర్శులు నాగేందర్ గౌడ్, జెట్టి వెంకటేష్, చంద్రరెడ్డి, శ్రీమతి చంద్రకళ, జలాల్, శివుడు, ప్రమోద్, దండు శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, జాకీర్ హుస్సేన్, రవీంద్ర చౌహాన్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్ ప్రసాద్ పోతుగంటి మాట్లాడుతూ, జిల్లా పార్టీ కార్యాలయం భవిష్యత్తులో పార్టీ విస్తరణ కార్యక్రమాలకు కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. సేవ, సుశాసనం, సమర్పణ అనే లక్ష్యాలతో ప్రజలకు మరింత చేరువయ్యే కేంద్రంగా ఈ నూతన కార్యాలయం నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
