గ్రామ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

పిప్రి (జె) గ్రామ వీడీసీ నూతన అధ్యక్షుడిగా పల్లి శ్రీనివాస్

భీమ్‌గల్ రూరల్, జూన్ 25 (ఆంధ్రప్రభ): నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం పిప్రి (జె)గ్రామంలో గురువారం నూతన గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా పల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా జంగం గంగారం, క్యాషియర్‌గా స్వామి,అనిల్, ఎన్నికయ్యారు. సభ్యులుగా కొడిగల స్వామి, నాలగంటి పరమేష్, సుంకరి భూమన్న, అశోక్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన వీడిసి అధ్యక్షులు మాట్లాడుతూ,మాపై నమ్మకంతో గ్రామ అభివృద్ధి అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.అలాగే నూతన వీడీసీ సభ్యులను సర్పంచ్ అరిగెల జనార్దన్ ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతూ, గ్రామ అభివృద్ధికి కమిటీ సభ్యులంతా సాయశక్తులా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పతాని జేమ్స్, పాలకవర్గం సభ్యులు,గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.