భారీ వర్షానికి కూలిన ప్రహారీ గోడ

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పోచం లొద్ది బాలుర ఆశ్రమోన్నత పాఠశాల ప్రహారిగోడ భారీ వర్షానికి మంగళవారం రాత్రి కూలిపోయిందని పోచంలొద్ది సర్పంచ్ మడవి మనోహర్ తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు సమాచారం ఇవ్వగా అక్కడి వెళ్లి పరిశీలించనని కాంపౌండ్ వాల్ (ప్రహరీ గోడ ) 30 ఫీట్లకు పైగా కూలిపోయిందని సర్పంచ్ తెలిపారు. ఐటీడీఏ అధికారులు కూలిపోయిన కాంపౌండ్ వాల్ గోడకు మరమ్మతు పనులు చేయించాలని ఆయన కోరారు.

పాఠశాలను సందర్శించిన సర్పంచ్ బడిబాట కార్యక్రమాల గురించి ఉపాధ్యాయులతో విద్యార్థులతో మాట్లాడారు. ఆశ్రమ పాఠశాల చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని మెనూ ప్రకారంగా భోజన వసతి కల్పించాలని సర్పంచ్ కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు వండిన వంటలను పరిశీలించి పాఠశాలలో సర్పంచ్ మడవి మనోహర్ భోజనం చేశారు.