సిర్పూర్ (యు) నూతన ఎస్సైగా కొమురయ్య

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల నూతన ఎస్సైగా కొమురయ్య పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆసిఫాబాద్‌లో విధులు నిర్వహించి బదిలీపై సిర్పూర్ (యు) మండలానికి వచ్చినట్లు తెలిపారు.

ఇక్కడ పనిచేసిన ఎస్సై విక్రం బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలానికి బదిలీ అయినట్లు తెలిపారు.

సిర్పూర్ (యు) నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కొమురయ్యకు బుధవారం బాండేరు సర్పంచ్ కుమ్ర భీమ్రావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని, సన్మానం చేయడానికి వచ్చిన సర్పంచులను కోరారు.