చిన్నారులకు అక్షరాభ్యాసం… యూనిఫాంల పంపిణీ

మునుగోడు, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని అంగన్‌వాడీ 1,4, కమ్మ గూడెం కేంద్రాలలో బుధవారం సర్పంచ్ పాలకూరి రమాదేవి చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి యూనిఫాంలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల భవిష్యత్తుకు అంగన్‌వాడీలే పునాదిగా నిలుస్తాయని, మూడు సంవత్సరాలు నిండిన వెంటనే పిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని తల్లులకు సూచించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ లు పారిజాత,ధనమ్మ, విక్టోరియా,తల్లులు పాల్గొన్నారు