శ్రీవారి సేవలో ఎమ్మెల్యే కొలికపూడి

శ్రీవారి సేవలో ఎమ్మెల్యే కొలికపూడి

ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక పూజలు
రైతులకు సమృద్ధి పంటలు పండాలని ఆకాంక్ష
యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని వేడుకోలు
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి శ్రీవారి ఆశీస్సులు కోరిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రభ, తిరువూరు: తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించారు. దర్శనానంతరం ఆలయ వేదపండితులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందించి ఆశీర్వదించారు. ప్రజల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, యువత భవిష్యత్తు, రాష్ట్ర పురోగతి కోసం శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు భక్తులు, అనుచరులు పాల్గొన్నారు.