ఎల్ఓసి అందించిన ప్రభుత్వ విప్..

పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ అభిదా మియా అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అభిదాకు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయ రమణారావు రూ. 1,00,000 ఎల్ఓసి మంజూరు చేయించారు. పెద్దపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎల్ఓసి అభిదా కుటుంబ సభ్యులకు విప్ విజయరమణ రావు అందించారు.