వాసవి సరోవర్ నిర్మాణంలో 40% మైలురాయి పూర్తి..
కొనుగోలుదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన డెవలపర్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని తమ ప్రతిష్టాత్మక నివాస ప్రాజెక్ట్ ‘వాసవి సరోవర్’ నిర్మాణం 40 శాతం పూర్తయిందని, ఇది ప్రాజెక్ట్ నిర్మాణ కాలక్రమంలో కీలక మైలురాయిగా నిలిచిందని వాసవి గ్రూప్ ప్రకటించింది. కూకట్‌పల్లి, హైటెక్ సిటీ మధ్య ఉన్న ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ ఐటీ కారిడార్, వాణిజ్య కేంద్రాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సేవా కేంద్రాలకు అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉంది. సహజ గాలి, వెలుతురు సమృద్ధిగా లభించేలా, నివాసితులకు ఆహ్లాదకరమైన ఓపెన్ వ్యూస్ అందేలా టవర్లను రూపకల్పన చేసినట్లు సంస్థ వెల్లడించింది. నిర్మాణ పురోగతిని పురస్కరించుకుని, భవిష్యత్ గృహ కొనుగోలుదారులకు సొంతింటి కలను సులభతరం చేయడానికి అనువైన చెల్లింపు విధానాలు, అద్దె ఆధారిత ప్రయోజనాలు, ఆర్థిక సహాయ పథకాలను సంస్థ ప్రవేశపెట్టింది.
సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ప్రారంభ దశలో తక్కువ ఆర్థిక భారం కోరుకునే కొనుగోలుదారుల నుంచి అద్దె ఆదాయం ఆశించే పెట్టుబడిదారుల వరకు అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆఫర్లను రూపొందించారు. వడ్డీ రాయితీతో కూడిన రెంటల్ ఫ్రీ ప్లాన్, అష్యూర్డ్ రెంటల్ ప్లాన్, కన్‌స్ట్రక్షన్ లింక్డ్ ప్లాన్ వంటి పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
‘డబుల్ బెనిఫిట్’ రెంటల్ ఫ్రీ ప్లాన్ కింద గృహ కొనుగోలుదారులు చదరపు అడుగుకు ప్రారంభ ధర రూ.8,000++ చొప్పున ఫ్లాట్లను కొనుగోలు చేయవచ్చు. ముందుగా 10 శాతం చెల్లించి, మిగిలిన మొత్తానికి హోమ్ లోన్ పొందే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా నెలకు రూ.25,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. అలాగే ప్రాజెక్ట్‌కు ఫైర్ ఎన్‌ఓసీ వచ్చే వరకు హోమ్ లోన్ వడ్డీ భారాన్ని వాసవి గ్రూప్ భరిస్తుంది. నిబంధనలు, షరతులకు లోబడి అర్హులైన కొనుగోలుదారులు రూ.22 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.
పెట్టుబడిదారులను దృష్టిలో ఉంచుకుని ‘అష్యూర్డ్ రెంటల్ ప్లాన్’ను కూడా ప్రవేశపెట్టారు. నిర్మాణ దశలోనే స్థిరమైన నెలవారీ అద్దె ప్రయోజనం పొందే అవకాశం ఇందులో ఉంటుంది. ‘ఈజీ పేమెంట్ ప్లాన్’ ద్వారా బుకింగ్ సమయంలో 20 శాతం చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నిర్మాణ పురోగతి ఆధారంగా చెల్లించవచ్చు. ఇటీవలి నెలల్లో హైదరాబాద్‌లో నమోదైన భారీ రిజిస్ట్రేషన్లు నగర రియల్ ఎస్టేట్ రంగంలో గృహ కొనుగోలుదారుల ఆసక్తిని ప్రతిబింబిస్తున్నాయి. అభివృద్ధి చెందిన కారిడార్లలో విశాలమైన, సకల సౌకర్యాలతో కూడిన ప్రాజెక్టులకు డిమాండ్ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో వాసవి సరోవర్ 40 శాతం నిర్మాణం పూర్తి చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా వాసవి గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ యెర్రం మాట్లాడుతూ, “వాసవి సరోవర్ 40 శాతం నిర్మాణం పూర్తి కావడం మా కస్టమర్లు మాపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. ఈ ప్రత్యేక ఆఫర్ల ద్వారా నాణ్యమైన నిర్మాణం, అద్భుతమైన కనెక్టివిటీ, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రీమియం జీవనశైలిని మరింత చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్ పట్టణ జీవనశైలికి కొత్త నిర్వచనం ఇచ్చేలా వాసవి సరోవర్ రూపుదిద్దుకుంటోంది” అని తెలిపారు. సంస్థ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. కోమటి కుంట చెరువు, చిన్న మైసమ్మ చెరువు వంటి స్థానిక జలవనరుల పరిరక్షణకు మద్దతుగా పలు కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతోంది.
20.08 ఎకరాల విస్తీర్ణంలో, 29 అంతస్తుల ఎత్తుతో కూడిన తొమ్మిది టవర్లతో వాసవి సరోవర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 70 శాతానికి పైగా ఓపెన్ స్పేస్, రెండు క్లబ్ హౌస్‌లు, 100కు పైగా లైఫ్‌స్టైల్, వినోద సౌకర్యాలతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. నిర్మాణ పురోగతితో పాటు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్లు ప్రాజెక్ట్‌కు మరింత ఆకర్షణ తీసుకువస్తున్నాయి.
