జన్నారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్..

జన్నారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్..

  • కొయ్యూరు సెక్షన్ కల్టివేషన్ వ్యవహారమే..
  • అక్కడి నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చినంక ఆదేశాలు..

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం.ఎ ఇంతియాజ్ ను కాలేశ్వరం సర్కిల్ సీసీఎఫ్ బి.ప్రభాకర్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొయ్యూరు రేంజ్ లోని కొయ్యూరు సెక్షన్ పరిధిలోని ఎడపల్లి ఫారెస్ట్ బీటులోని పోడు భూమి వ్యవహారంలో గతంలో అక్కడ పనిచేసిన ఇంతియాజ్ నిర్లక్ష్యం వహించారనే అభియోగం మేరకు సస్పెండ్ చేశారు.ఇటీవల అటవీ శాఖ ఉన్నతాధికారుల బదిలీల కౌన్సిలింగ్ లో కొయ్యూరు ఫారెస్ట్ సెక్షన్ నుంచి అతను జన్నారంకు బదిలీపై వచ్చి,ఈనెల 1న జాయిన్ అయ్యారు. ఇంతలోనే అతను సస్పెన్షన్ కు గురికావడం విశేషం.ఈ మేరకు అతనికి సస్పెన్షన్ ఆదేశాలను జన్నారం రేంజ్ ద్వారా అందజేశారు.అతని స్థానంలో సెక్షన్ ఆఫీసర్ శంకర్ ను నియమించినట్లు స్థానిక ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్ జి. వికాస్ సోమవారం సాయంత్రం తెలిపారు.